
గిరిజన యూనివర్సిటీలో పరిశోధన విద్య
విజయనగరం అర్బన్: కేంద్రీయ గిరిజన యూనివర్సిటీలో ఇప్పటికే అందిస్తున్న అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) పీజీ కోర్సులతో పాటు ఈ ఏడాది నుంచి రీసెర్చ్ స్కాలర్ (పరిశోధన విద్య) కోర్సులను అందించనున్నామని యూనివర్సిటీ ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ టి.శ్రీనివాసన్ తెలిపారు. కేంద్ర ప్రభు త్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం పాలసీలోని ప్రధాన అంశాలను గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే రాష్ట్రంలో అమలులోకి తెచ్చింది. ఇందులో భాగంగా పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు పటిష్ట పునాదులను ఆ ప్రభుత్వమే వేసింది. మెంటాడ, దత్తిరాజేరు మండలాల పరిధిలో ఏర్పాటైన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ నిర్మాణ పనులు ఓ వైపు సాగుతున్నాయి. స్థానిక ఆంధ్రయూనివర్సిటీ ఎక్స్‌టెంట్ పీజీ కేంద్రం ప్రాంగణలోని భవనాల్లో ప్రస్తుతం గిరిజన యూని వర్సిటీ తాత్కాలిక నిర్వహణలో ఉంది. గిరిజన వర్సిటీ అకడమిక్ పురోగతిని ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ టి.శ్రీనివాసన్ ‘సాక్షి’కి వివరించారు. ఆయన మాటల్లోనే...
నాలుగు అంశాలపై పరిశోధన
యూనివర్సిటీలో ఇప్పటికే అందిస్తున్న అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) కోర్సు, పీజీ కోర్సులతో పాటు ఈ ఏడాది నుంచి రీసెర్చ్ స్కాలర్ (పరిశోధన విద్య) కోర్సులను అందించనున్నాం. యూనివర్సిటీలో ప్రసుతం ఉన్న ఎనిమిది పీజీ కోర్సులతో పాటు మరో నాలుగు డిపార్ట్‌మెంట్‌లకు సంబంధించిన సబ్జెక్టుల పరిశోధనా అంశాలపై కొత్త కోర్సులు నిర్వహిస్తాం. తొలిదశలో ప్రతి కోర్సులో రెండు సీట్లలో మాత్రమే ప్రవేశాలు కల్పిస్తాం. ఈ విద్యాసంవత్సరం నుంచి నిర్వహించే పరిశోధన కోర్సుల కోసం త్వరలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తాం. ఎంపికైన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి ప్రవేశం కోసం 21రోజుల గడువు ఇస్తాం.
ఈ ఏడాది నుంచి ప్రవేశాలు ప్రారంభం
ముగిసిన పీజీ ప్రవేశాలు
మిగులు సీట్లకు ఈ నెల 8న ఓపెన్ కౌన్సెలింగ్
కేంద్రీయ గిరిజన
యూనివర్సిటీ
ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ టి.శ్రీనివాసన్

గిరిజన యూనివర్సిటీలో పరిశోధన విద్య