
బాగుచేసేవారు లేక...
బాడంగి మండలంముగడ గ్రామానికి చెందిన తెంటువాని చెరువు ఆయకట్టుకు సాగునీరందించే ఫీల్డ్, ఫీడర్ చానల్స్ తుప్పలు, పూడికలతో నిండిపోయాయి. బాగుచేయాలంటూ అధికారులు, పాలకులకు రైతులు విన్నవించారు. అదును దాటిపోతున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఉపాధిహామీ పనులతో కాలువలు అభివృద్ధిచేసే అవకాశం ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఆయకట్టు రైతులందరూ ఏకమై శ్రమదానంతో కాలువలు బాగుచేసేందుకు నడుంబిగించారు. చెరువు నీరు పొలాలకు మళ్లించేందుకు వీలుగా కాలువల్లోని పూడికలను గురువారం తొలగించారు. రైతు సమస్యలను పట్టించుకునే తీరిక కూటమి నేతలకు లేదంటూ పలువురు వాపోయారు. – బాడంగి