
ఎరువుల దుకాణాల తనిఖీ
విజయనగరం ఫోర్ట్: విజయనగరం మన్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఎరువుల దుకాణాల్లో వ్యవసాయ అధికారులు ఆదివారం తనిఖీ నిర్వహించారు. జిల్లా వ్యవసాయ అధికారి వి. తారకరామారావు, సహాయ సంచాలకుడు నాగభూషణరావు, ఇన్‌చార్జి మండల వ్యవసాయ అధికారి నీలిమ తనిఖీలు నిర్వహించి స్టాక్ రిజిస్టర్‌లు, బిల్లు పుస్తకాలు, ఎరువుల భౌతిక నిల్వలు, కంపెనీ ఇన్వాయిస్ గోదాములను పరిశీలించారు. ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 21.55 మెట్రిక్ టన్నుల ఎరువులను సీజ్ చేశారు. సీజ్ చేసిన ఎరువుల విలువ రూ.3,74,588 ఉంటుందని జిల్లా వ్యవసాయ అధికారి తారకరామరావు తెలిపారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్‌మొత్తానికి 25,443 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ప్రస్తుతానికి 20, 629 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంచామని అమ్మకాలు పోగా 5467మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. ఎంఆర్‌పీకి మించి ఎరువులు ఎక్కడైనా విక్రయించినట్లయితే ఫోన్ 8331056279 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
21.55 మెట్రిక్ టన్నుల ఎరువుల సీజ్