
ఏడాది పాలనలో ఏం చేశారో చెప్పండి
చీపురుపల్లి: ఏడాది పాలనలో ప్రజలకు ఏం చేశారో చెప్పగలగాలని, లేని పరిస్థితిలో పల్లెలకు వెళ్లడం దండగని కూటమి నేతల పాలనా తీరును వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఎండగట్టారు. చీపురుపల్లి మండలంలోని కర్లాం గ్రామంలో మంగళవారం సాయంత్రం బాబు ష్యూరిటీ..మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి నేతలు గ్రామాల్లో తిరుగుతున్నారని, ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పాలన్నారు. తాము గ్రామాల్లోనికి వస్తే తమ ప్రభుత్వంలో చేసిన ఎంతో అభివృద్ధితోపాటు మరెన్నో సంక్షేమ పథకాల కోసం చెప్పగలమన్నారు. టీడీపీ నేతలు అలా చెప్పగలరా అని ప్రశ్నించారు. గడిచిన ఎన్నికల్లో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు ఎన్నో హామీలు ఇచ్చారని, దాని కోసం బాండ్లు కూడా ఇచ్చి మోసం చేశారన్నారు. హామీలు అమలచేసేలా ప్రజల తరఫున వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తోందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనువాసులనాయుడు, మీసాల వరహాలనాయుడు, బెల్లాన వంశీకృష్ణ, బెల్లాన త్రినాథరావు, దన్నాన జనార్దనరావు, సర్పంచ్ బాణాన భాగ్యలక్ష్మి, ఎంపీటీసీ బాణాన రామరత్నం, ఎంవీఎస్‌ఎస్‌ఎన్ రాజు, కొంచాడ శ్రీనివాస్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
కూటమి నేతలను ప్రశ్నించిన జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు