
మృతదేహం వివరాలు లభ్యం
లక్కవరపుకోట: మండలంలోని చందులూరు గ్రామం సమీపంలో గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు సోమవారం గమనించిన విషయం తెలిసిందే. ఈ మేరకు పోలీసులు విచారణ చేపట్టి మృతుడిని మార్లాపల్లి గ్రామానికి చెందిన లెక్కల ఈశ్వరరావు(51)గా గుర్తించారు. మృతుడు వేసుకున్న బట్టలను, మృతదేహాన్ని బంధువులు చూసి గుర్తుపట్టినట్లు ఎస్సై నవీన్‌పడాల్ తెలిపారు. ఈశ్వర రావుకు విపరీతంగా తాగుడు అలవాటు ఉంది. ఈ క్రమంలో శనివారం రాత్రి పూటుగా మద్యం తాగి ఇంటి నుంచి వెళ్లేపోయాడు. ఎప్పటి మాదిరిగా తిరిగి వస్తాడనుకోగా ఎంతకీ రాలేదు. చందులూరు వైపు వెళ్లి రోడ్డు పక్కన తుప్పల్లో పడిపోవడంతో సాయం చేసిన వారు లేక మృతి చెంది ఉంటాడని కుటుంబసభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. మృతుడికి భార్య వరం, కూతురు, కొడుకు ఉన్నారు. ఈ మేరకు భార్య వరం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.