
మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తిచేయాలి ˘
విజయనగరంఫోర్ట్: స్వచ్ఛభారత్ మిషన్ కార్పొరేషన్ ద్వారా జిల్లాలోని 147 అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్లను ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. తన చాంబర్‌లో మరుగుదొడ్ల నిర్మాణంపై వివిధ శాఖల అధికారులతో బుధవారం సమీక్షించారు. మరో 74 కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌కు ప్రతిపాదనలు పంపించామని సూచించారు. ఒకటి రెండు రోజుల్లో వీటికి అనుమతి తెప్పిస్తామని తెలిపారు. 144 అంగన్‌వాడీ కేంద్రాలకు ఆగస్టు 20వ తేదీలోగా నీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. ఆగస్టు మొదటి వారానికి 31 అంగన్‌వాడీ కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని తెలిపారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ టి.విమలారాణి, ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ మువ్వ లక్ష్మణరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కవిత, తదితరులు పాల్గొన్నారు.
సీ్త్రనిధి రుణ లక్ష్యం
రూ.283 కోట్లు
● సీ్త్రనిధి ఏజీఎం చిట్టిబాబు
రామభద్రపురం: జిల్లాలో మహిళా సంఘాల సభ్యుల జీవనోపాధి మెరుగుకోసం సీ్త్రనిధి కింద రూ.283 కోట్ల రుణాలు ఇచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని ఏజీఎం వై.చిట్టిబాబు తెలిపారు. మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన వీఓఏల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలు సద్వినియోగం చేసుకునేలా రుణాలు మంజూరు చేయాలని, వంద శాతం రికవరీ చేయాలని సూచించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ జిల్లాలో సుమారు 40 వేల డ్వాక్రా సంఘాలున్నాయన్నారు. ఇప్పటి వరకు సీ్త్రనిధి కింద రూ.89 కోట్లు రుణాలు ఇచ్చామన్నారు. ఒక్కో సభ్యురాలికి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు రుణం ఇస్తామన్నారు. నూటికి నెలకు 92 పైసలు వడ్డీ పడుతుందన్నారు. సకాలంలో చెల్లిస్తే అధిక వడ్డీభారం ఉండదన్నారు. మహిళలు చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే సీ్త్రనిధి ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో క్లస్టర్ మేనేజర్ రమేష్, ఏపీఎం మోహన్, సీసీ సింగరాజు, తదితరులు పాల్గొన్నారు.
రేపటి నుంచి ఆటోమ్యుటేషన్
విజయనగరం: మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఆస్తులు (ఇల్లు, అపార్ట్‌మెంట్, ఖాళీ స్థలాలు) రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఆటోమ్యుటేషన్ జరు గుతుందని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ జిల్లా రిజిస్ట్రార్ టి.ఉపేంద్రరావు తెలిపారు. తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రిజిస్ట్రేషన్, మున్సిపల్ అర్బన్ అడ్మినిస్ట్రేషన్ శాఖ అనుసంధానంతో ప్రజల సౌకర్యార్థం తప్పులులేని డేటాతో ప్రజలే నేరుగా ఆస్తి వివరాలను నమోదు చేయడం, బాకీ పన్నులు, మ్యుటేషన్ రుసుములను నేరుగా ఆన్‌లైన్‌లోనే చెల్లించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు వెల్లడించారు. ఆటో మ్యుటేషన్‌తో నకిలీ పత్రాలు, భూ వివాదాలకు చెక్ చెప్పవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తిచేయాలి ˘

మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తిచేయాలి ˘