
తక్కువ వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టు ఇదే
పెదంకలాం ప్రాజెక్టును రూ.1.30 కోట్ల వ్యయంతో 8వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టారు. కాలువల ఆధునికీకరణకు హుద్‌హుద్ తుఫాన్ సమయంలో జైకా నిధులు మంజూరు చేసినప్పటికీ కాంట్రాక్టర్ పూర్తిస్థాయిలో కాలువల ఆధునీకీకరణ పనులు నిర్వహించని కారణంగా కాలువల ద్వారా సాగునీరు సరఫరా కాని పరిస్థితి నెలకొంది. ప్రతి ఏటా సాగునీటి కోసం ఆందోళనే తప్పా సమస్యకు శాశ్వత పరిష్కారం కావడం లేదు.
– సింహాద్రి నాయుడు, రైతు కూలీసంఘం జిల్లా నాయకుడు, పార్వతీపురం
●