
అర్జీలకు 48 గంటల్లో పరిష్కారం చూపాలి
● కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్
పార్వతీపురం: పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన అర్జీలకు 48 గంటల్లో పరిష్కారం చూపాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ అధికారులకు సూచించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన పీజీఆర్‌ఎస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్‌ఎస్ శోభిక, ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాత్సవ, డీఆర్‌ఓ కె. హేమలత, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి.ధర్మచంద్రారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ ఎం.సుధారాణిలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 122 మంది అర్జీ దారుల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన వినతులను నాణ్యతతో కూడిన పరిష్కారం చూపించేలా అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పోలీస్ వ్యవస్థను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యం
పార్వతీపురం రూరల్: పోలీస్ వ్యవస్థ ప్రజలకు మరింత చేరువ అయ్యేలా చేయడమే తమ శాఖ లక్ష్యమని ఎస్పీ ఎస్‌వీ. మాధవ్ రెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి 8 అర్జీలను స్వీకరించి, వారితో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీసీఆర్బీ ఎస్సై ఫకృద్దీన్ తదితర సిబ్బంది ఉన్నారు.
ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌కు 24 వినతులు
సీతంపేట: స్థానిక ఐటీడీఏలో పీఓ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 24 వినతులు వచ్చాయి. తుంబలి గ్రామానికి చెందిన కొండలరావు విద్యుత్ స్తంభాలు తమ గ్రామంలో వేయాలని కోరారు. కుంబిడి ఇచ్ఛాపురానికి చెందిన మండంగి బాలకృష్ణ ఫారెస్టు భూమి రీసర్వే చేయాలని విజ్ఞప్తి చేశాడు. సింగిడి గ్రామస్తుడు సూర్యవర్మ తమకు శాశ్వత ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేశారని చర్యలు తీసుకోవాలని కోరారు. పవర్ టిల్లర్ మంజూరు చేయాలని పలువురు రైతులు వినతులు ఇచ్చారు. కోదుల వీరఘట్టంకు చెందిన త్రినాథరావు తమ ఇద్దరి పిల్లలకు తల్లికి వందనం రాలేదని ఫిర్యాదు చేశాడు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీఓ చిన్నబాబు, ఈఈ కుమార్, డిప్యూటీ ఈఓ రామ్మోహన్‌రావు, జీసీసీ మేనేజర్లు దాసరి కృష్ణ, గొర్లె నరసింహులు, వ్యవసాయాధికారి వాహిని, ఏపీడీలు సన్యాసిరావు, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

అర్జీలకు 48 గంటల్లో పరిష్కారం చూపాలి

అర్జీలకు 48 గంటల్లో పరిష్కారం చూపాలి