
రాధికారాణికి జాతీయ పురస్కారం
విజయనగరం టౌన్: నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ ప్రతి ఏటా ఇచ్చే జాతీయ స్థాయి పురస్కారాల్లో భాగంగా విజయనగరానికి చెందిన ప్రముఖ నృత్య కళాకారిణి, నర్తనశాల డ్యాన్స్ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ భేరి రాధికారాణిని జాతీయ పురస్కారంతో సత్కరించారు. ఈ మేరకు ఆదివారం ఆమె మాట్లాడుతూ హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో శనివారం రాత్రి నిర్వహించిన వేడుకల్లో తన నాట్య కౌశలం, అభినయం, నర్తనశాల అకాడమీ డైరెక్టర్‌గా నాట్యరంగానికి సుమారు మూడు దశాబ్దాలుగా అందిస్తున్న సేవలను గుర్తించి అవార్డును తనకు అందజేసినట్లు తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి, మల్కాజ్‌గిరి కోర్టు న్యాయమూర్తి మధుసూదనరావుల చేతులమీదుగా పురస్కారం అందుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు జిల్లాకు చెందిన పలు సాంస్కృతిక సస్థల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.