
హాస్టల్ విద్యార్థులకు.. అరకొర సౌకర్యాలు
రాజాం ఎస్సీ పోస్టు మెట్రిక్ బాలుర వసతిగృహంలో నేలపైనే నిద్రిస్తున్న విద్యార్థులు
నేలపైనే నిద్ర...
● కొన్ని వసతిగృహాల్లో నీరు తాగేందుకు గ్లాసులు కూడా లేవు. బొబ్బిలి పట్టణంలోని ఎస్సీ కళాశాల వసతిగృహంలో గత ప్రభుత్వం ఏర్పాటుచేసిన మినరల్ వాటర్ ప్లాంట్ మరమ్మతులకు గురైంది. దానిని బాగుచేయకపోవడంతో మూలకు చేరింది. దీంతో అక్కడ చదువుతున్న 70 మంది విద్యార్థులకు తాగునీటి సమస్య వెంటాడుతోంది. మోటారు బావిలోని నీటినే తాగుతున్నారు. ఒక వేళ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే ట్యాంకులోని నీరే గతి. ఇక్కడి విద్యార్థులు ఆడుకునేందుకు పరికరాలు కూడా లేకపోవడంతో ఉల్లిపాయల సంచులను కోసి వాటిని నెట్‌గా మార్చి ప్లాస్టిక్ బాల్ (ముంతబాలు)తో ఆడుకుంటున్నారు. వార్డెన్ కూడా ఇటీవల కొంత కాలంగా ఇక్కడ లేకపోవడంతో కుక్, కమాటీ, వాచ్‌మన్‌లే వసతి గృహాన్ని నిర్వహిస్తున్నారు. బొబ్బిలి డివిజన్‌లో ఉన్న 14 ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో మరమ్మతులకు సుమారు రూ.2 కోట్లను ఖర్చు చేసినట్టు రికార్డులు చెబుతున్నా ఆ మరమ్మతులేవీ వసతి గృహాల్లో కనిపించడం లేదు.
● సంతకవిటి మండలంలోని హాస్టల్స్‌లో విద్యార్థుల హాజరు అంతంతమాత్రమే. చాలామంది విద్యార్థులు భోజనం చేసి ఇంటికి వెళ్లిపోతున్నారు. రాత్రిపూట వార్డెన్ పర్యవేక్షణ ఉండడంలేదు.
● దత్తిరాజేరు మండలం కె.కొత్తవలస మహాత్మాజ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలలో సుమారు 400 మంది విద్యార్థులు ఉండగా, వీరు భోజనం చేసేందుకు వసతిసమస్య వెంటాడుతోంది.
● దత్తిరాజేరు బీసీ హాస్టల్‌కు ప్రహరీలేకపోవడంతో విద్యార్థులను విషసర్పాల భయం వెంటాడుతోంది.
రాజాం/బొబ్బిలి/సంతకవిటి/దత్తిరాజేరు:
వివిధ సంక్షేమ హాస్టల్స్‌లో ఉంటూ చదువులు సాగిస్తున్న విద్యార్థులను సమస్యలు వెంటాడుతున్నాయి. కనీస సదుపాయాలు కల్పించకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. కొన్ని వసతిగృహాల్లో మరుగుదొడ్లు, స్నానపుగదులు కూడా లేకపోవడంతో చెరువులు, కాలువలు, గెడ్డల వైపు వెళ్లాల్సిన పరిస్థితి. చక్కగా చదువుకుని భవితను బంగారుమయం చేసుకోవాలన్న ఆశతో తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్స్‌లో చేరిన విద్యార్థులపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
● రాజాం పట్టణంలో ఐదు సంక్షేమ వసతిగృహాలు ఉన్నాయి. మూడు బాలికలకు, రెండు బాలురకు సంబంధించినవి కాగా శ్రీకాకుళం రోడ్డులోని సాంఘిక సంక్షేమ పోష్టుమెట్రిక్ బాలుర వసతిగృహంలో విద్యార్థులు బయటనుంచి భోజనాలు, టిఫిన్స్ తెప్పించుకుంటున్నారు. రాత్రిళ్లు విద్యుత్ సమస్య వెంటాడుతోంది. వార్డెన్‌తో పాటు సిబ్బంది ఉండకపోవడంతో విద్యార్థులకు పర్యవేక్షణలోపం వెంటాడుతోంది. విద్యార్థులకు మంచాలు లేకపోవడతో నేలపైనే నిద్రపోతున్నారు. వసతిగృహం చుట్టూ ప్రహరీ లేకపోవడంతో విషసర్పాల భయం వెంటాడుతోంది. సారథి రోడ్డులోని బాలికల పోస్టుమెట్రిక్ వసతిగృహంతో పాటు మాధవబజార్‌లోని అద్దె భవనంలో ఉంటున్న వసతిగృహంలో బాలికలకు మరుగుదొడ్లు, స్నానపు గదుల సమస్య వెంటాడుతోంది.
జిల్లాలోని పలు వసతిగృహాల విద్యార్థులు అసౌకర్యాల నీడలో చదువులు సాగిస్తున్నారు. పరుపులు లేక నేలపైనే నిద్రపోతున్నారు. సరిపడా మరుగుదొడ్లు, స్నానపు గదులు లేక ఇబ్బంది పడుతున్నారు. మెనూ అమలుకాక అనారోగ్యం బారిన పడుతున్నారు. కిటీలకు డోర్లు, ప్రహరీలు లేకపోవడంతో విషసర్పాల భయం వెంటాడుతోంది. ఇన్వెర్టర్లు లేకపోవడంతో విద్యుత్ సరఫరా అంతరాయం సమయంలో అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నారు. కాస్మోటిక్, డైట్ చార్జీలు అందక ఆవేదన చెందుతున్నారు. విద్యార్థుల సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం విస్మరించిందంటూ గగ్గోలు పెడుతున్నారు. ఆందోళనలు చేస్తున్నారు.
నేలపైనే నిద్ర
ప్రహరీలు లేకపోవడంతో చొరబడుతున్న విషసర్పాలు
కిటికీలకు డోర్లులేని వైనం
విద్యార్థుల సంక్షేమం గాలికి
గ్లాసులూ కరువే..

హాస్టల్ విద్యార్థులకు.. అరకొర సౌకర్యాలు

హాస్టల్ విద్యార్థులకు.. అరకొర సౌకర్యాలు

హాస్టల్ విద్యార్థులకు.. అరకొర సౌకర్యాలు

హాస్టల్ విద్యార్థులకు.. అరకొర సౌకర్యాలు

హాస్టల్ విద్యార్థులకు.. అరకొర సౌకర్యాలు