
రిటైర్డ్ ఎస్సైపై యువకుల దాడి
విజయనగరం క్రైమ్: నగరంలోని అయ్యప్పనగర్‌కు చెందిన రిటైర్డ్ ఎస్సై ముని బుచ్చిరాజుపై దాడి చేసిన ముగ్గురు నిందితులను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రిటైర్డ్ ఎస్సై మునిబుచ్చిరాజు తన కొడుకును ఈ నెల 19 వ తేదీ రాత్రి రైల్వేస్టేషన్‌లో దింపి తిరిగి ఇంటికి బయల్దేరారు. మార్గమధ్యంలో బైక్ ట్రబుల్ ఇవ్వడంతో పాతబస్టాండ్‌లో బైక్ ఉంచేసి నడుచుకుంటూ ఇంటికి బయల్దేరారు. ఆ సమయంలో బొండపల్లి మండలం గుమడాం గ్రామస్తులు పవన్, రాజేష్, అలాగే హుకుంపేటకు చెందిన సాయి(18) రిటైర్డ్ ఎస్సై రాజుపై దాడి చేసి జేబులో ఉన్న రూ.3 వేల నగదు దోచుకుని పరారయ్యారు. అతి కష్టం మీద రిటైర్డ్ ఎస్సై రాజు ఇంటికి చేరుకుని స్థానికుల సహాయంతో హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స చేయించుకుని 20 వ తేదీన టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఎస్సై కృష్ణమూర్తి కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను సోమవారం అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు.

రిటైర్డ్ ఎస్సైపై యువకుల దాడి