● మార్కులే జీవితం కాదు..
పదో తరగతిలో 359 మార్కులు మాత్రమే వచ్చాయి. ఇంటర్‌లో బైపీసీలో జాయిన్ అయి ఫెయిలయ్యాను. మరలా ఎంపీసీలో జాయిన్ అయ్యి పట్టుదలతో చదివి ఉత్తమ ఫలితం సాధించాను. ఇంజినీరింగ్ చదివి 25 ఏళ్లుగా అమెరికాలో స్థిరపడి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాను. పరీక్ష ఫలితాలు అంటేనే చాలా మంది విద్యార్థులతో పాటు వారి తల్లిందండ్రుల్లో కంగారు ఉండడం సహజం. ఫలితాలు ఎలా ఉంటాయో.. తమకు ఫలితాలు ఎలా వస్తాయోనని విద్యార్థులు సైతం టెన్షన్ పడడం సహజమే. కానీ పరీక్ష ఫలితం ఎలా వచ్చినా ఆందోళన చెందకూడదు. నేటి ఓటమి రేపటి విజయానికి మెట్టులాంటిది.
– పెద్దింటి రామారావు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, యూఎస్‌ఏ


