
ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం
కూటమి సర్కారు వచ్చిన తరువాత ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ప్రభుత్వం నుంచి మత్స్యకారుల సంక్షేమానికి ఎటువంటి భరోసా లేదు. చింతపల్లిలో జెట్టీ నిర్మాణానికి గత ప్రభుత్వం వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసింది. నేటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంచుమించు ఏడాది అవుతున్నా కనీసం స్పందన లేదు. మత్స్యకారులు వేట సాగక వలసలు వెళ్లే పరిస్థితి ఉంది. తక్షణమే ప్రభుత్వం జీవనభృతి మంజూరు చేయాలి. ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణ పనులు ప్రారంభించాలి. – బర్రి దాసు, మత్స్యకారుడు, చింతపల్లి
●