
పశు సంవర్ధకశాఖ అధికారుల సంఘం అధ్యక్షుడిగా కృష్ణ
విజయనగరం ఫోర్ట్: పశు సంవర్ధకశాఖ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ రెడ్డి కృష్ణ ఎన్నికయ్యారు. ఈ మేరకు స్థానిక పశు సంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయంలో బుధవారం పశు సంవర్థకశాఖ అధికారుల సంఘం నూతన కార్యవర్గానికి ఎన్నికలు నిర్వహించారు. ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ సీహెచ్. దీనకుమార్, ఉపాధ్యక్షుడిగా డాక్టర్ టి.ధర్మారా వు, కోశాధికారిగా డాక్టర్ కేవీరమణ, సంయుక్త కార్యదర్శిగా డాక్టర్ ఆర్. శారద ఎన్నికయ్యారు. ఈ ఎన్నికకు అఽధికారిగా రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షుడు బాలకృష్ణ వ్యవహరించారు.
డీసీహెచ్‌ఎస్‌గా డాక్టర్ పద్మశ్రీ రాణి
విజయనగరం ఫోర్ట్: జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయధికారి(డీసీహెచ్‌ఎస్)గా డాక్టర్ ఎన్.పి.పద్మశ్రీ రాణి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా ఇన్‌చార్జ్ డీసీహెచ్‌ఎస్‌గా పనిచేస్తున్న ఆమె ఉద్యోగోన్నతిపై రెగ్యులర్ డీసీహెచ్‌ఎస్‌గా ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డీసీహెచ్‌ఎస్ పరిధిలో ఉన్న ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం డీసీహెచ్‌ఎస్ పరిధిలో ఖాళీ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేస్తామన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆమెకు డీసీహెచ్‌ఎస్ కార్యాలయం సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలియజేశారు.
రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక
నెల్లిమర్ల: రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొనే అండర్–19 విభాగం జిల్లా జట్టును నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని జరజాపుపేటలో బుధవారం ఎంపిక చేశారు. పురుషుల విభాగంలో నాగ వెంకట్(48–50), రోహిత్(50–55), ఎర్రి నాయుడు(55–60), ప్రవీణ్(60–65), కిరణ్(70–75), సూర్య తేజ(80–85), బాలకుమార్(85–90), లోకేష్(90+)లు ఎంపికయ్యారు. వీరు త్వరలో విశాఖపట్నంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఎంపిక పోటీలను జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మద్దిల అప్పలనాయుడు, జనరల్ సెక్రటరీ లక్ష్మణరావు, జాయింట్ సెక్రటరీ శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు కాళ్ల మహేష్ తదితరులు నిర్వహించారు.
వడదెబ్బతో వ్యక్తి మృతి
బొబ్బిలి: ఎండ వేడిమికి తాళలేక తెర్లాం మండలం కె.సీతారాంపురానికి చెందిన కోస్టు సింహాచలం(58) బొ బ్బిలి రైల్వేస్టేషన్‌లో బుధవారం మృతిచెందాడు. యాత కులస్తుడైన సింహాచలం వెదురుతో తయారయ్యే బుట్టలు, కోళ్ల గూళ్ల ను పటిష్టంగా ఉంచే నల్లుకట్టే పని చేస్తుంటాడు. ఈ పనిమీదనే రాయగడ వెళ్లి పనిముగించుకుని తిరిగి స్వగ్రామం వచ్చే సమయంలో బొబ్బిలి రైల్వేస్టేషన్‌లో దిగి ఎండ వేడిమికి సేదతీరుతూ అస్వస్థతకు గురై మృతి చెందినట్లు భావిస్తున్నారు.రెండో ప్లాట్‌ఫాంపై మృతి చెందిన వ్యక్తి సంఘటనలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రైల్వే హెచ్‌సీ బి ఈశ్వరరావు తెలిపారు.

పశు సంవర్ధకశాఖ అధికారుల సంఘం అధ్యక్షుడిగా కృష్ణ

పశు సంవర్ధకశాఖ అధికారుల సంఘం అధ్యక్షుడిగా కృష్ణ

పశు సంవర్ధకశాఖ అధికారుల సంఘం అధ్యక్షుడిగా కృష్ణ