వృత్తి పట్ల అంకిత భావంతో పనిచేయాలి
● డీఎంహెచ్‌ఓ డాక్టర్ జీవనరాణి
విజయనగరం ఫోర్ట్: వృత్తిపట్ల అంకిత భావంతో పనిచేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి అన్నారు. ఈ మేరకు జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం ఆమె ఆశ కార్యకర్తలకు యూనిఫాం పంపిణీ చేశారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 1775 మంది ఆశ కార్యకర్తలకు యూనిఫాం పంపిణీ చేసినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరికి ఆరోగ్య సదుపాయాలు అందించడంలో ఆశ కార్యకర్తలు ప్రముఖ పాత్ర వహిస్తున్నారన్నారు. ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసి జిల్లాను ముందు స్థాయిలో నిలబెడుతున్నారని ప్రశంసించారు. కార్యక్రమంలో ఆశ జిల్లా కో ఆర్డినేటర్ బి.మహాలక్ష్మి, సీహెచ్‌ఓ చంద్రశేఖరాజు తదితరులు పాల్గొన్నారు.


