డ్రగ్స్ నియంత్రణకు సమన్వయంతో పని చేయాలి
విజయనగరం క్రైమ్: డ్రగ్స్ నియంత్రణకు అందరూ సమన్వయంతో కలిసి పనిచేయాలని జిల్లా అదనపు ఎస్పీ సౌమ్యలత అన్నారు. ఈ మేరకు స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో మంగళవారం జరిగిన సమన్వయ సమావేశంలో ఏఎస్పీ పాల్గొని మాట్లాడారు. మాదక ద్రవ్య రహిత జిల్లాగా విజయనగరం ఉండేలా ప్రతి ఒక్కరూ పని చేయాలని కోరారు. డ్రగ్స్ భూతాన్ని తరిమి కొట్టేందుకు ప్రభుత్వం ఈగిల్ అనే ప్రత్యేక వింగ్‌ను ఏర్పాటు చేసిందని చెప్పారు. ఈ వింగ్‌కు ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క శాఖ తమ వంతు సహాయ సహకారాలను అందించాలని కోరారు. గంజాయి వ్యసనానికి అలవాటు పడిన వారిని గుర్తించి సన్మార్గంలో పెట్టేందుకు అందరూ కృషి చేయాలని ఏఎస్పీ సౌమ్యలత సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం, ప్రొహిబిషన్ ఎకై ్సజ్ అధికారి శ్రీనాథుడు, డిజేబుల్ వెల్ఫేర్ ఆఫీసర్ అన్నపూర్ణ, డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్లు లలిత, త్రినాథ్ రావు, డిస్ట్రిక్ సర్వేలైన్స్ అధికారి డా.సత్యనారాయణ,సెట్విజ్ సీఈఓ సోమేశ్వరరావు,ఈగిల్ జేఓ ఎం.కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
అదనపు ఎస్పీ సౌమ్యలత


