అంతర్జాతీయ క్రీడా పోటీల్లో బంగారు పతకాలు
చీపురుపల్లిరూరల్(గరివిడి): అంతర్జాతీయస్థాయిలో జరిగిన పవర్‌లిఫ్టింగ్, స్విమ్మింగ్ క్రీడల పోటీల్లో గరివిడి పట్టణానికి చెందిన క్రీడాకారులు బంగారు పతకాలు సాధించారు. ఏప్రిల్ 3 నుంచి 7వరకు ఎస్‌బీకేఎఫ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నేపాల్ దేశంలో జరిగిన ఈ క్రీడాపోటీల్లో మహిళల విభాగంలో పవర్ లిఫ్టింగ్ క్రీడాంశంలో రాజమహంతి రమణిప్రియ 330 కేజీల బరువును ఎత్తి ప్రథమ స్థానంలో నిలిచి బంగారుపతకం, షాట్‌ఫుట్, డిస్క్‌త్రో పోటీల్లో కూడా ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాలు సాధించింది. పురుషుల విభాగంలో పవర్‌లిఫ్టింగ్‌లో వైవీ.ప్రసాద్ 400 కేజీల బరువును ఎత్తి ప్రథమ స్థానంలో స్వర్ణ పతకం, అలాగే 50 మీటర్ల స్విమ్మింగ్ పోటీల్లో బంగారు పతకం,100 మీటర్ల స్విమ్మింగ్ పోటీల్లో రజత పతకం సాధించాడు.


