ఏపీటీఎస్‌ఏ నూతన కమిటీ ఏకగ్రీవం
విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ సర్వీస్ అసోసియేషన్ (ఏపీటీఎస్‌ఏ) ఉమ్మడి విజయనగరం జిల్లా శాఖ నూతన కమిటీని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శనివారం స్థానిక సంఘ కార్యాలయంలో జరిగిన ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా డి.నవీన్‌చంద్, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా పి.సురేష్‌కుమార్, జిల్లా సెక్రటరీగా కేవీఎస్‌ఎస్ సింధూర, వైస్ ప్రెసిడెంట్లుగా ఎస్.దివ్యభారతి, పి.సంతోష్‌కుమార్, వై.కామినాయుడు, బీవీఎస్‌ఎం నాయుడు, జాయింట్ సెక్రటరీలుగా వి.సరస్వతమ్మ, టి.అనిల్, ఎస్.రంజిత్‌కుమార్, ట్రెజరర్‌గా జి.ప్రశాంత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా పి.కిరణ్‌కుమార్, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్‌గా ఎస్.భాస్కర్, ఎలక్షన్ పరిశీలకుడిగా డి.రమణరెడ్డి వ్యవహరించారు. అనంతరం నూతన కమిటీ సభ్యులను పలువురు అభినందించారు. కార్యక్రమంలో పెన్షనర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెద్దింటి అప్పారావు, జి.నారాయణ, నాయుడు జగన్నాథం, కామరాజు, సత్యంనాయుడు, ఏపీఎన్‌జీఓ జిల్లా, పట్టణ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీధర్‌బాబు, సురేష్, వై.ఆనంద్‌కుమార్, కనకరాజు, కోశాధికారి ఎస్‌వీ సుధాకర్, శ్రీకాకుళం, విశాఖపట్నం , తూర్పుగోదావరి, పార్వతీపురం జిల్లాల నుంచి ట్రెజరీ సిబ్బంది పాల్గొన్నారు.


