జిల్లా వాసులకు అరకు కాఫీ రుచులు
పార్వతీపురం: జిల్లా వాసులకు అరకు కాఫీ రుచులు అందుబాటులోకి తేసుకురానున్నట్లు పార్వతీపురం ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ అన్నారు. పట్టణంలోని ఐటీడీఏ పెట్రోల్ బంక్ వద్ద ఏర్పాటు చేసిన అరకు కాఫీ స్టాల్‌ను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో అరకు కాఫీకి మంచి గుర్తింపు ఉందన్నారు. అరకు కాఫీని అన్ని ప్రాంతాలకు విస్తరించాలనే ఉద్ధేశంతో ఇటీవల పార్లమెంట్, శాసనసభలలో అవుట్‌లెట్స్ ప్రారంభించారన్నారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో గతంలోనే పెట్రోల్‌బంక్ వద్ద అరకు కాఫీని ప్రారంభించినప్పటికీ.. అనివార్య కారణాల వల్ల మూసివేయాల్సి వచ్చిందన్నారు. దీన్ని మరలా తెరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈయనతో పాటు ఏపీఓ ఎ.మురళీధర్, సహయ గణాంకాధికారి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ


