జాతీయ స్థాయి ర్యాంకర్లకు అభినందనలు | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి ర్యాంకర్లకు అభినందనలు

Nov 30 2026 12:05 AM | Updated on Nov 30 2026 12:05 AM

జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలతో ప్రిన్సిపాల్‌ ఎన్‌.సాలమాన్‌, ర్యాంకర్లు

కంచరపాలెం: అఖిల భారత ట్రేడ్‌ టెస్ట్‌ (ఏఐటీటీ)–2026 పరీక్షల్లో జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి టాప్‌ ర్యాంకులు సాధించిన 20 మంది ఐటీఐ విద్యార్థులను శనివారం కంచరపాలెం ప్రభుత్వ పాత ఐటీఐలో అభినందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ ఎన్‌.సాలమాన్‌ విద్యార్థులకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సాధించిన విజయాలు ఐటీఐ సంస్థలకు, తల్లిదండ్రులకు, శిక్షణాధికారులకు గర్వకారణమన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ డి.వెంకటేశ్వరరావు, ఐఎంసీ చైర్మన్‌ బి.ఎస్‌.బి.ప్రభాకరరావు, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement