అల్లిపురం: నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో 16 మంది ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం కలిగింది. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందు లో కొంతమందికి పోస్టింగ్‌లు ఇవ్వగా, మరికొంత మందిని వీఆర్‌కు పంపించారు. మహారాణిపేట సీఐగా ఉన్న జి.దివాకర్ యాదవ్‌ను భీమిలి లా అండ్ ఆర్డర్‌కు, అక్కడ ఉన్న బి.తిరుమలరావును వెస్ట్ క్రైం సబ్ డివిజన్‌కు బదిలీ చేశారు. టూటౌన్ లా అండ్ ఆర్డర్ నుంచి వీవీసీఎం ఎర్రంనాయుడును ఆనందపురం లా అండ్ ఆర్డర్‌కు, అక్కడ పనిచేస్తున్న చింతా వాసునాయుడును గాజువాక లా అండ్ ఆర్డర్‌కు స్థానచలనం కలిగించారు. గాజువాక లా అండ్ ఆర్డర్ సీఐ నమ్మి గణేష్‌ను దువ్వాడ లా అండ్ ఆర్డర్‌కు, అక్కడ విధులు నిర్వర్తిస్తున్న కూసా మల్లేశ్వరరావును హార్బర్ లా అండ్ ఆర్డర్‌కు మార్చారు. హార్బర్ లా అండ్ ఆర్డర్ నుంచి సీహెచ్ సింహాద్రినాయుడును సిటీ వీఆర్–1కు పంపించారు. సిటీ వీఆర్–5లో ఉన్న బి.సురేష్‌ను ఎయిర్‌పోర్ట్ ప్రోటోకాల్‌కు, అక్కడ పనిచేస్తున్న జి.దేముడు బాబును సౌత్ సబ్ డివిజన్ క్రైమ్‌కు కేటాయించారు. వెస్ట్ సబ్ డివిజన్ క్రైమ్‌లో ఉన్న ఎం.చంద్రమౌళిని పద్మనాభం లా అండ్ ఆర్డర్‌కు, అక్కడి నుంచి సీహెచ్ శ్రీధర్‌ను సిటీ వీఆర్–3కు బదిలీ చేశారు. సీఎస్‌బీ–3లో పనిచేస్తున్న గంగుల గోవిందరావును మహారాణిపేట లా అండ్ ఆర్డర్‌కు, సిటీ వీఆర్–3లో ఉన్న బి.అప్పలనాయుడును టూటౌన్ లా అండ్ ఆర్డర్‌కు పోస్టింగ్ ఇచ్చారు. సిటీ వీఆర్–1లో ఉన్న సీహెచ్.ఉమాకాంత్‌ను నార్త్ ట్రాఫిక్ సర్కిల్‌కు బదిలీ చేయగా, అక్కడ ఉన్న నల్లి సాయిని సిటీ వీఆర్–5కు పంపించారు.


