రథయాత్రకు ప్రత్యేక రైళ్లు | - | Sakshi
Sakshi News home page

రథయాత్రకు ప్రత్యేక రైళ్లు

Jul 10 2026 7:46 AM | Updated on Jul 10 2026 7:46 AM

తాటిచెట్లపాలెం: పూరీలో జరిగే జగన్నాథ రథయాత్ర సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖపట్నం–పూరీ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. విశాఖపట్నం–పూరీ (08551) స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 15, 23 తేదీల్లో మధ్యాహ్నం 12.30 గంటలకు విశాఖపట్నం నుంచి బయల్దేరి అదే రోజు రాత్రి 9.30 గంటలకు పూరీ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో పూరీ–విశాఖపట్నం (08552) స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 17, 25 తేదీల్లో తెల్లవారుజామున 2.30 గంటలకు పూరీ నుంచి బయల్దేరి అదే రోజు ఉదయం 11.05 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు ఇరువైపులా సింహాచలం, కొత్తవలస, విజయనగరం,చీపురుపల్లి, పొందూరు, శ్రీకాకుళం రోడ్‌, తిలారు, కోటబొమ్మాళి, నౌపడ, పలాస, మందస రోడ్‌, సోంపేట, ఇచ్చాపురం, బ్రహ్మపూర్‌, చత్రపూర్‌, ఖల్లికోట్‌, బలుగాం, కలుపర్‌ఘాట్‌, నిరాకార్‌పూర్‌, హరిపూర్‌గ్రామ్‌, మోటారి, కనాస్‌ రోడ్‌, డెలాంగ్‌, జెనాపూర్‌ రోడ్‌, బీర్‌పురుషోత్తంపూర్‌, సఖిగోపాల్‌, జనకిదైపూర్‌, మాలతీపట్పూర్‌ స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లలో 4 స్లీపర్‌ క్లాస్‌ కోచ్‌లు, 6 జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ కోచ్‌లు, 2 సెకండ్‌ క్లాస్‌ కమ్‌ లగేజీ/దివ్యాంగుల కోచ్‌లు ఉంటాయని అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement