మహారాణిపేట: భారత ప్రభుత్వ కేంద్ర గణాంక, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ సౌరభ్ గార్గ్ బుధవారం విశాఖపట్నం రానున్నారు. ఈ మేరకు జాతీయ గణాంక కార్యాలయ డిప్యూటీ డైరెక్టర్ జనరల్(డీడీజీ) డి.సతీష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తన పర్యటనలో భాగంగా కేంద్ర కార్యదర్శి విశాఖలోని జాతీయ గణాంక ఉప ప్రాంతీయ కార్యాలయాన్ని సందర్శిస్తారు. అనంతరం దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్న నేషనల్ హౌస్‌హోల్డ్ ఇన్‌కమ్ సర్వే ఫీల్డ్ వర్క్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఆయనతో పాటు జాయింట్ డైరెక్టర్ రజత్, అసిస్టెంట్ డైరెక్టర్ పి.రాజశేఖర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారని డీడీజీ పేర్కొన్నారు.


