విద్యార్థులే దేశ భవిష్యత్తు | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులే దేశ భవిష్యత్తు

Apr 9 2026 8:17 AM | Updated on Apr 9 2026 8:17 AM

మద్దిలపాలెం: ‘మీరు కేవలం విశ్వవిద్యాలయ విద్యార్థులు మాత్రమే కాదు, ఈ దేశ భవిష్యత్తు కూడా’అని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కె.పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో బుధవారం జరిగిన మెగా కల్చరల్‌ ఫెస్ట్‌లో ఆయన మాట్లాడారు. ‘మీరంతా ఈ విశ్వవిద్యాలయ భవిష్యత్తు. ఇక్కడ గడిపే కాలం మీ జీవితంలో అత్యంత ముఖ్యమైనది, మీ దిశను నిర్ణయించేది. సమస్యలను ఎదుర్కొనే ధైర్యం, సమాజానికి ఉపయోగపడే బాధ్యతను విద్యే అందిస్తుంది’ అని తెలిపారు. ప్రపంచాన్ని మార్చే శక్తి విద్యకే ఉందన్న నెల్సన్‌ మండేలా మాటలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఏయూ ప్రాంగణం కేవలం ఒక క్యాంపస్‌ మాత్రమే కాదని, విలువల దేశ నిర్మాణంలో ముఖ్య భూమిక పోషించిన భారతీయ వారసత్వ సంపదకు నిదర్శనమని కొనియాడారు. విద్యా ర్థుల ప్రశ్నలు ఎంతో స్వచ్ఛంగా ఉంటాయని, పుస్తకాలతో కుస్తీ పట్టే వారితో మాట్లాడటం ఒక సాహసమని, అందుకే తాను మనసుతో మాట్లాడుతున్నానని అన్నారు. ‘భగవంతుడు నాకు ఇక్కడ చదువుకునే అవకాశం ఇవ్వలేదు కానీ, మిమ్మల్ని ఇలా కలిసే అవకాశం ఇచ్చాడు. నా స్నేహితుడు, ఏయూ పూర్వ విద్యార్థి త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఇక్కడ ఎమ్మెస్సీ న్యూక్లియర్‌ ఫిజిక్స్‌ చదివారు. ’అని వెల్లడించారు. వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్‌, రెక్టర్‌ ఆచార్య పి.కింగ్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య కె.రాంబాబు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్‌,రమేష్‌ బాబు, సుందరపు విజయ్‌ కుమార్‌, వీఎంఆర్డీఏ చైర్మన్‌ ప్రణవ్‌ గోపాల్‌, కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌, ఫెస్ట్‌ చైర్మన్‌ ఆచార్య ఎన్‌. విజయ్‌ మోహన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

=====

08వీఎస్‌సి727 –ప్రసంగిస్తున్న డిప్యూటి సిఎం పవన్‌కల్యాణ్‌

08వీఎస్‌సి727ఎ– అలరించిన విద్యార్ధుల నృత్య ప్రదర్శన

వీఎస్‌సీపీ తో కూడా ఫొటోలు ఉంటాయి..

ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement