వేతనాల పెంపునకై పోరుబాట | - | Sakshi
Sakshi News home page

వేతనాల పెంపునకై పోరుబాట

Feb 25 2026 10:38 AM | Updated on Feb 25 2026 10:38 AM

వేతనాల పెంపునకై పోరుబాట

వేతనాల పెంపునకై పోరుబాట

కొనసాగిన అంగన్‌వాడీల

రిలే నిరాహార దీక్షలు

బీచ్‌రోడ్డు: ఎన్నికల్లో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల వేతనాలు పెంచుతామని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చినప్పటికీ, నేటికీ ఆ హామీని అమలు చేయకపోవడం అన్యాయమని సీఐటీయూ అఖిల భారత నాయ కుడు కుమార్‌ అన్నారు. అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు, వేతనాల పెంపు డిమాండ్‌తో మంగళవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద యూనియన్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ వేతనాలు పెరగకపోవడంతో అంగన్‌వాడీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు వేతనాలు పెంచకుండా, మరోవైపు యాప్‌ల ద్వారా పనిభారం పెంచుతూ ప్రభుత్వం వీరిని తీవ్ర శారీరక, మానసిక ఒత్తిడికి గురిచేస్తోందని విమర్శించారు. అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం నిర్దిష్టమైన చర్యలు చేపట్టాలని, తక్షణమే వేతనాల పెంపుపై ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా గౌరవ అధ్యక్షురాలు పి.మణి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.పద్మావతి, ప్రధాన కార్యదర్శి కె.వెంకటలక్ష్మి, డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ బృందావతి, కోశాధికారి ఆర్‌.శోభారాణి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీదేవి, కోమలి, తులసి, శివలక్ష్మి, సాయి సరస్వతి, చిన్న అమ్ములు, రమణమ్మ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement