పార్టీ సంస్థాగత కమిటీల నియామకం పూర్తి చేయండి
వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర
ప్రాంతీయ సమన్వయకర్త కన్నబాబు
మహారాణిపేట: పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు సంస్థాగత కమిటీల నియామక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయా లని వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్త కురసాల కన్నబాబు పిలుపునిచ్చారు. మంగళవారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి సంస్థాగత కమిటీల ఏర్పాటును వేగవంతం చేయాలని సూచించారు. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లా అధ్యక్షులు కేకే రాజు, గుడివాడ అమర్‌నాథ్, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, తిప్పల నాగిరెడ్డి, తైనాల విజయకుమార్, చింతలపూడి వెంకట్రామ య్య, సమన్వయకర్తలు మొల్లి అప్పారావు, దేవన్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, పార్టీ నాయకురాలు పేడాడ రమణి కుమారి పాల్గొన్నారు.


