జీవీఎంసీ పీజీఆర్‌ఎస్‌కు 140 వినతులు
డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ కేతన్ గార్గ్ అధ్యక్షతన నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 140 వినతులు అందాయి. ఇందులో అత్యధికంగా పట్టణ ప్రణాళికా విభాగానికి 72, ఇంజినీరింగ్‌కు 25, అడ్మినిస్ట్రేషన్‌కు 19 ఫిర్యాదులు వచ్చాయి. అదనపు కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో ఈ వినతులను స్వీకరించారు. ప్రజలు ఇచ్చిన అర్జీలపై అధికారులు అదే రోజు స్పందించి కార్యాచరణ చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు. ఒకే సమస్యపై బాధితులు పదేపదే కార్యాలయానికి రాకుండా, నిర్ణీత సమయంలో శాశ్వత పరిష్కారం చూపాలని జోనల్ కమిషనర్లకు స్పష్టం చేశారు. ఫిర్యాదీలతో నేరుగా సంప్రదించి పనులు వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ పి.నల్లనయ్య, ప్రధాన ఇంజినీర్ పీవీ సత్యనారాయణరాజు, వైద్యాధికారి నరేష్‌కుమార్, సీసీపీ ప్రభాకరరావు, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డి, డీసీఆర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.


