ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

Feb 24 2026 9:07 AM | Updated on Feb 24 2026 9:07 AM

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

విశాఖ సిటీ: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన సత్వరమే పరిష్కరించాలని మెట్రోపాలిటన్‌ కమిషనర్‌ ఎన్‌.తేజ్‌భరత్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం వీఎంఆర్‌డీఏ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో 16 ఫిర్యాదులు వచ్చాయి. కమిషనర్‌ స్వయంగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిపై వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడారు. నిర్ణీత వ్యవధిలో న్యాయపరంగా చిక్కులు లేనివాటిని వెంటనే పరిష్కరించాలని చెప్పారు. వచ్చిన ఫిర్యాదుల్లో ప్రణాళిక విభాగానికి చెందినవి 10, ఎస్టేట్‌కు 3, పరిపాలన విభాగానివి 2, సాంకేతిక విభాగానివి ఒకటి వచ్చింది. కార్యక్రమంలో వీఎంఆర్‌డీఏ కార్యదర్శి పి.మురళీకృష్ణ, సీయూపీ వి.శిల్ప, ఎస్టేట్‌ అధికారి దయానిధి, పరిపాలనాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement