వాల్తేర్‌ డిస్ట్రిక్ట్‌, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌కు ఆరు అవార్డులు | - | Sakshi
Sakshi News home page

వాల్తేర్‌ డిస్ట్రిక్ట్‌, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌కు ఆరు అవార్డులు

Feb 24 2026 9:07 AM | Updated on Feb 24 2026 9:07 AM

వాల్తేర్‌ డిస్ట్రిక్ట్‌, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌కు ఆరు

వాల్తేర్‌ డిస్ట్రిక్ట్‌, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌కు ఆరు

తాటిచెట్లపాలెం: ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వేకు చెందిన వాల్తేర్‌ డిస్ట్రిక్ట్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌కు ఆరు ప్రతిష్టాత్మక రాష్ట్రపతి అవార్డులు దక్కాయి. ఈ అవార్డులు అసాధారణమైన అంకితభావం, క్రమశిక్షణ, నాయకత్వ, సేవలకు గాను లభించాయి. స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ వరల్డ్‌ థింకింగ్‌ డే సందర్భంగా విశాఖలోని ’అరణ్య’ క్యాంప్‌ కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో వాల్తేర్‌ డివిజన్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌, భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌, వాల్తేర్‌ డిస్ట్రిక్ట్‌ ప్రెసిడెంట్‌ లలిత్‌ బోహ్ర చేతుల మీదుగా అవార్డులను అందించారు. వాల్తేర్‌ డిస్ట్రిక్ట్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌కు 2 రాష్ట్రపతి రోవర్స్‌, 2 రాష్ట్రపతి గైడ్స్‌, 2 రాష్ట్రపతి రేంజర్స్‌ అవార్డులు దక్కాయి. కార్యక్రమంలో ఈకార్వో ప్రెసిడెంట్‌ జ్యోత్స్న బోహ్ర, ఏడీఆర్‌ఎం (ఆపరేషన్స్‌)కె.రామారావు, ఏడీఆర్‌ఎం (ఇన్‌ఫ్రా) ఈ శాంతారం, ఈకార్వో వైస్‌ ప్రెసిడెంట్‌ గాయత్రి శాంతారం, సీనియర్‌ డిఈఎన్‌ (కోఆర్డినేషన్‌) అరుణకుమార్‌ మహరాణా పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement