
ముగిసిన నామినేషన్ల ఘట్టం
స్థాయీ సంఘం ఎన్నికల్లో
మొత్తం 21 నామినేషన్లు
డాబాగార్డెన్స్: జీవీఎంసీ స్థాయీ సంఘం ఎన్నిక నామినేషన్ల ఘట్టం మంగళవారంతో ముగిసింది. వైఎస్సార్ సీపీ నుంచి 10 మంది, కూటమిలోని టీడీపీ నుంచి 9 మంది, బీజేపీ నుంచి ఒకరు, జనసేన నుంచి ఒకరు నామినేషన్లు దాఖలు చేశారు. బుధవారం ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లను పరిశీలిస్తారు. ఆగస్టు 2 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. 6వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపు, అనంతరం ఫలితాలు వెల్లడిస్తారు.
● వైఎస్సార్ సీపీ నుంచి నిక్క లక్ష్మి(20వ వార్డు), సాడి పద్మారెడ్డి(24వ వార్డు), పల్లా అప్పలకొండ(28వ వార్డు), బిపిన్ కుమార్ జైన్(31వ వార్డు), గుండాపు నాగేశ్వరరావు(40వ వార్డు), కోడిగుడ్ల పూర్ణిమ(41వ వార్డు), రెయ్యి వెంకటరమణ(51వ వార్డు), కేవీఎన్ శశికళ(55వ వార్డు), మహ్మద్ ఇమ్రాన్(66వ వార్డు), ఉరుకూటి రామచంద్రరావు(70వ వార్డు) నామినేషన్లు దాఖలు చేశారు.
● టీడీపీ నుంచి మొల్లి హేమలత(5వ వార్డు), సేనాపతి వసంత(96వ వార్డు), రాపర్తి త్రివేణి వరప్రసాదరావు(92వ వార్డు), దాడి వెంకట రామేశ్వరరావు(88వ వార్డు) రమేష్, రౌతు శ్రీనివాస్(78వ వార్డు), మొల్లి ముత్యాలు(87వ వార్డు) మాదంశెట్టి చిన్నతల్లి(83వ వార్డు), వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలో చేరిన కొణతాల నీలిమ(79వ వార్డు), గేదెల లావణ్య(17వ వార్డు)లకు కూటమి అవకాశం కల్పించింది. అలాగే బీజేపీ కార్పొరేటర్ గంకల కవిత(47వ వార్డు) నామినేషన్ దాఖలు చేశారు. జనసేనలో చేరిన స్వతంత్ర కార్పొరేటర్ మహ్మద్ సాధిక్(39వ వార్డు) 11వ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం.