
ఆటో మ్యుటేషన్‌తో అందరికీ మేలు
మధురవాడ: రిజిస్ట్రేషన్ వ్యవస్థలో ప్రభుత్వం తీసుకువస్తున్న అర్బన్ ఆటో మ్యుటేషన్ పద్ధతి అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ బాలకృష్ణ అన్నారు. మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ‘అర్బన్ ఆటో మ్యుటేషన్’ అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. డాక్యుమెంట్ రైటర్ పబ్లిక్ డేటా ఎంట్రీలో తీసుకోవల్సిన జాగ్రత్తలు, దీనివల్ల కక్షిదారులకు కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. అక్రమ రిజిస్ట్రేషన్లు అరికట్టేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలోకి తీసువచ్చినట్టు చెప్పారు. ప్రజలు తమ భూమి వివరాలను registration.ap.gov.in ద్వారా స్వయంగా తెలుసుకోవచ్చన్నారు. సబ్ రిజిస్ట్రార్ చక్రపాణి మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో ఆస్తిని కొనుగోలు చేసిన తర్వాత కక్షిదారుడు మ్యుటేషన్ కోసం జీవీఎంసీ చుట్టూ తిరిగే పని ఇక ఉండదని, ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్ అన్నింటిలోనూ పేరు ఆటోమెటిక్‌గా మారిపోతుందని చెప్పారు. కార్యక్రమంలో పలువురు డాక్యుమెంట్ రైటర్లు, కక్షిదారులు పాల్గొన్నారు.
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ బాలకృష్ణ