సమర్థవంతంగా నిర్వహిస్తాం | - | Sakshi
Sakshi News home page

సమర్థవంతంగా నిర్వహిస్తాం

Jun 20 2026 11:49 AM | Updated on Jun 20 2026 11:49 AM

అనంతగిరి: సర్‌ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అడిషనల్‌ కలెక్టర్‌ వెంకటాచారి తెలిపారు. శుక్రవారం నగరం నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి అన్ని జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అనంతరం అడిషనల్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఈ నెల 25 నుంచి ఇంటింటి సర్వే ప్రారంభమవుతుందని, ఇందుకు కోసం 1,133 మంది బూత్‌ స్థాయి అధికారులను నియమించి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి స్వర్ణలత, హెచ్‌ విభాగం సూపరింటెండెంట్‌ నేమత్‌ అలీ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇళ్ల గణన పక్కాగా ఉండాలి

బంట్వారం: సర్‌ కార్యక్రమంలో భాగంగా ఇళ్ల గణన పక్కాగా నిర్వహించాలని డీఆర్‌ఓ స్వర్ణలత సూచించారు. శుక్రవారం బంట్వారం, కోట్‌పల్లి మండల కేంద్రాల్లో బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 25 నుంచి జూలై 24వ తేదీ వరకు ఇంటింటి గణన నిర్వహించాలని సూచించారు. జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించాలన్నారు. ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. సెప్టెంబర్‌ 28 వరకు పరిశీలన, విచారణ పూర్తి చేసి అక్టోబర్‌ ఒకటిన తుది ఓటరు జాబితను విడదల చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌, డీటీ మహేశ్‌, బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలు తదితరలు పాల్గొన్నారు.

అడిషనల్‌ కలెక్టర్‌ వెంకటాచారి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement