షాబాద్ సీఐ కాంతారెడ్డి
షాబాద్: మత్తుపదార్థాలు విక్రయిస్తే కేసులు తప్పవని షాబాద్ సీఐ కాంతారెడ్డి హెచ్చరించారు. ప్యూచర్ సిటీ కమిషనర్ ఆదేశాల మేరుకు శుక్రవారం మండల పరిధిలోని దామర్లపల్లిలో డాగ్‌స్క్వాడ్, ఈగల్ టీం బృందాలతో దుకాణాల పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఎక్కడ డ్రగ్స్ విక్రయించిన వాటిని ఉపయోగించిన డాగ్‌స్క్వాడ్ ఈగల్ టీంలతో పరిశీలన చేసి కేసులు నమోదు చేస్తామని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని ఆయన తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ తనిఖీల్లో ఎస్‌ఐ సతీష్‌కుమార్, పోలీస్ సిబ్బంది తదితరులున్నారు.


