ఏఐతోనే భవిష్యత్తు | - | Sakshi
Sakshi News home page

ఏఐతోనే భవిష్యత్తు

Jun 20 2026 11:49 AM | Updated on Jun 20 2026 11:49 AM

ఏఐతోనే భవిష్యత్తు

పరిగి: భవిష్యత్తు మొత్తం ఏఐతోనే అని ప్రభుత్వ డిగ్రీకళాశాల నోడల్‌ అధికారి గంగాధర్‌ అన్నారు. పట్టణ కేంద్రంలోని కళాశాలలో అన్న అక్క మెంటర్‌షిప్‌ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం 5వ సెమిస్టర్‌ చదువుతున్న విద్యార్థులకు ఏఐ, డిజిటల్‌ లర్నింగ్‌పై శిక్షణా తరగతులు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రెండు రోజుల పాటు నిర్వహించిన తరగతుల ద్వారా విద్యార్థులు ఎన్నో విషయాలు నేర్చుకున్నారని తెలిపారు. శిక్షణ పూర్తి వారు కళాశాల విద్యాశాఖ కేటాయించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు 30 గంటల పాటు ఏఐ, డిజిటల్‌ లెర్నింగ్‌ అంశాలను బోధించాల్సి ఉంటుందని చెప్పారు. ఇందుకు గాను 1 క్రెడిట్‌ మార్క్‌తో పాటు కళాశాల విద్యాశాఖ వారిచే సర్టిఫికెట్‌ అందజేస్తామని చెప్పారు. ఏఐ నేర్చుకోవడం ద్వారా విద్యార్థులకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ సునితాపద్మావతి, ట్రైనర్‌ సుష్మశ్రీ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement