గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం | - | Sakshi
Sakshi News home page

గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం

Jun 19 2026 7:51 AM | Updated on Jun 19 2026 7:51 AM

గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం సర్‌ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేఽశ్‌రెడ్డి

దుద్యాల్‌: గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సా ధ్యమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేశ్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని ఈర్లపల్లిలో రూ.30 లక్షల వ్యయంతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. కార్యక్రమంలో కొడంగల్‌ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ వేణుగోపాల్‌, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ప్రధాన కా ర్యదర్శి వెంకటయ్య, ఎస్టీ సెల్‌ మండల అధ్యక్షుడు రవి నాయక్‌, మండల ఉపాధ్యక్షుడు కృష్ణ, సర్పంచ్‌ మొగులప్ప, జీపీ కార్యదర్శి సూర్యప్రకాశ్‌రెడ్డి పాల్గొన్నారు.

ఆదర్శంగా నిలుద్దాం

బొంరాస్‌పేట: అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి ఆదర్శంగా నిలుద్దామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేశ్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని పలు గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ.. అనంతరం నాందార్‌పూర్‌లో ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశంలో పాల్గొన్నారు. టేకులగడ్డ తండాలో రూ.30లక్షల నిధులతో గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. కార్యక్రమా ల్లో పార్టీ నాయకులు నర్సింలుగౌడ్‌, జయకృష్ణ, మల్లేశ్‌, మల్లికార్జున్‌, రాజునాయక్‌, సర్పంచులు లక్ష్మి, లక్ష్మీబాయి, కార్యదర్శులు శోభారాణి, శ్రీనివాస్‌లు తదితరులు పాల్గొన్నారు.

దుద్యాల్‌: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని అడిషనల్‌ కలెక్టర్‌ వెంకటాచారి సూచించారు. గురువారం మండల కేంద్రంలో బీఎల్‌ఏలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చనిపోయిన వారి పేర్లను, డబుల్‌ ఎంట్రీలను ఓటరు జాబితా నుంచి తొలగించాలన్నారు. నకిలీ ఓట్లకు ఆస్కారం ఇవ్వొదని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ కిషన్‌, బీఎల్‌ఏలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement