రైతు సంక్షేమానికి పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

రైతు సంక్షేమానికి పెద్దపీట

Jun 19 2026 7:51 AM | Updated on Jun 19 2026 7:51 AM

వికారాబాద్‌ ఏఎంసీ చైర్మన్‌ శ్రీనివాస్‌ ముదిరాజ్‌

అనంతగిరి: అన్నదాతల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని వికారాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌ ముదిరాజ్‌ అన్నారు. గురువారం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆవరణలో రైతులకు కంది మినీ కిట్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పప్పుధాన్యాల ఉత్పత్తి పెంపు, నేల సారవంత పరిరక్షణ, రైతుల ఆదాయ వృద్ధి, పోషకాహార భద్రతలో కంది పంట కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కంది విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడి పొందవచ్చని తెలిపారు. అనంతరం ఏఓ ప్రసన్న లక్ష్మి మాట్లాడారు. వికారాబాద్‌ మండలానికి 326 కంది మినీ కిట్లు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ మల్లేశ్‌, ఏడీఏ వెంకటేశం, ఏఎంసీ సెక్రటరీ వెంకటేశ్వర్‌ రెడ్డి, డైరెక్టర్లు విజేందర్‌ రెడ్డి, పాపిరెడ్డి, ప్రభాకర్‌, రాజు నాయక్‌, రమేష్‌ నాయక్‌, నర్సింలు, ఏఈఓ అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement