రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
తాండూరు: జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన తాండూరు రైల్వే స్టేషన్‌లో గురువారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. మాణిక్‌నగర్‌కు చెందిన రాము(35) పెయింటర్ పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఇతనికి భార్య యశోదతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నాళ్లుగా తాగుడుకు బానిసైన రామును ఆర్థిక, అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. ఈక్రమంలో తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో ముంబై ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫామ్‌పైకి వస్తుండగా రైలు కింద దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించామని రైల్వే పోలీసులు తెలిపారు.
పార్క్ చేసిన బైక్ చోరీ


