అభివృద్ధి పనుల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనుల పరిశీలన

Jun 19 2026 7:45 AM | Updated on Jun 19 2026 7:45 AM

అనంతగిరి: పంచాయతీ రాజ్‌ నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రత్యేకాధికారులు నీరజ, శైలజారెడ్డి పరిశీలించారు. గురువారం వీరు వికారాబాద్‌ మండలం అత్వెల్లి గ్రామంలో పర్యటించారు. 15వ ఆర్థిక సంఘం నిధులు, ఎస్‌ఎఫ్‌సీ నిధులు, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులు, గ్రామ పంచాయతీ జనరల్‌ ఫండ్‌ ఖర్చుపై ఆరా తీశారు. ఏయే పనులు చేపట్టారని అడిగి తెలుసుకున్నారు. గ్రామ పంచాయతీ ఆస్తులు, రికార్డుల నిర్వహణ, ఎస్‌హెచ్‌జీ భవనాల నిర్మాణం, ఇందిరమ్మ ఇండ్లు, సీసీ రోడ్లు, యూజీడీ నిర్మాణం, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌ల తీర్మానాలు, అగ్రిమెంట్లు, ఎన్‌బీల నిర్వహణ, క్యాష్‌ బుక్‌లతో సరి చూశారు. కార్యక్రమంలో డీపీఓ జయసుధ, డీఎల్‌పీఓ సంధ్యారాణి, ఎంపీడీఓ వినయ్‌కుమార్‌, సర్పంచ్‌ విజయలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి పూర్ణిమ, ఎఫ్‌ఏ రత్నం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement