మట్టి డంపింగ్ పరిశీలన
కేశంపేట: మండల పరిధిలోని అల్వాల గ్రామ శివారులో అక్రమంగా ఎర్రమట్టి డంపింగ్ చేశారని గురువారం సాక్షి దినపత్రికలో వార్త ప్రచురితమైంది. దీంతో రెవెన్యూ అధికారులు స్పందించారు. అక్రమంగా మట్టిని డంపింగ్ చేసిన ప్రదేశాన్ని ఆర్‌ఐ చెన్నకేశవులు, జీపీఓ బచ్చయ్య పరిశీలించారు. మట్టిని అక్కడి నుంచి తరలించవద్దని డంపింగ్ చేసిన వారికి సూచించారు. ఎర్ర మట్టి తరలింపునకు ఎలాంటి అనుమతులు లేవని తహసీల్దార్ రాజేందర్‌రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.
ఎల్‌ఐసీ రెన్యూవల్ చేస్తానని..
కొత్తూరు: ఎల్‌ఐసీ పాలసీ రెన్యూవల్ చేస్తానని నమ్మించి ఓ కార్మికుడి ఖాతా నుంచి సైబర్ నేరస్తుడు రూ.1,89,200 నగదు బదిలీ చేసుకున్నాడు. ఈ సంఘటన కొత్తూరు పట్టణంలో గురువారం ఆలస్యంగా వెలుగు చూసింది. సీఐ నర్సయ్య తెలిపిన వివరాల మేరకు.. జార్ఖండ్ రాష్ట్రం రామ్‌ఘడ్ జిల్లా వెస్ట్ బోకారోకు చెందిన రమేష్ కేవత్ (34) కొన్ని నెలలుగా పట్టణంలోని ఓ హాస్టల్‌లో ఉంటూ నందిగామ మండలంలో ఉన్న పిత్తిల్యామినేషన్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఈ నెల 6న రాత్రి తన మొబైల్‌ఫోన్ అప్‌డేట్ అవుతున్నట్లు గమనించాడు. మరుసటి రోజు ఉదయం జైహింద్ అనే వ్యక్తి రమేష్‌కు ఫోన్‌చేసి ఎల్‌ఐసీ రెన్యూవల్ చేస్తానని నమ్మించి బ్యాంకు ఖాతా, ఇతర వివరాలు తస్కరించాడు. విడతల వారీగా అతడికి తెలియకుండా ఈ నెల 7, 8వ తేదీల్లో ఆన్‌లైన్, ఖాతాలకు రూ.1,89,200 బదిలీ చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న బాధితుడు సైబర్‌క్రైం నంబర్ 1930కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కేశంపేట: సర్‌పై ఓటర్లు, రాజకీయ పార్టీల నాయకులు అపోహలు పెట్టుకోవద్దని తహసీల్దార్ రాజేందర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో గురువారం ఎస్‌ఐఆర్‌పైన బూత్ లెవల్ అధికారులు, ఏజెంట్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సర్‌పై ట్రైనర్ శరత్ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు యెన్నం శ్రీధర్‌రెడ్డి, మురళీధర్‌రెడ్డి, అనుమగళ్ల రమేశ్, నర్సింహయాదవ్, నవీన్‌కుమార్, వేణుగోపాలచారి, నరేందర్‌రెడ్డి, శివాజీ తదితరులు పాల్గొన్నారు.
షాద్‌నగర్‌రూరల్: ప్రతి రోజు యోగ సాధన చేయడంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని పతంజలి యోగా సమితి వ్యవస్థాపకుడు పానుగంటి శశిధర్ అన్నారు. అంతర్జాతీయ యోగా వారోత్సవాలలో భాగంగా గురువారం పతంజలి యోగాసమితి ఆధ్వర్యంలో పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శశిధర్ మాట్లాడుతూ.. మారుతున్న జీవనశైలిలో మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వానికి యోగ ఎంతో అవసరమని అన్నారు. ప్రతిఒక్కరు తమ దైనందిన జీవితంలో యోగాను ఒక భాగం చేసుకోవాలని సూచించారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతి
అనంతగిరి: గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు వికారాబాద్ రైల్వే పీఎస్ ఇంచార్జి హరిప్రసాద్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. గురువారం ఉదయం ధారూరు–గోధంగూడ మధ్యలో రైల్వే ట్రాక్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు సమాచారం రావడంతో రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుని వద్ద చిరునామాకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతుడు అందాజా 40 సంవత్సరాలు ఉంటాడని, ఒంటిపై నీలం రంగు షర్ట్, పింక్–తెలుపు రంగు షార్ట్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురికి తరలించి భద్రపరిచారు. ఎవరైనా సమాచారం, ఆచూకీ తెలిస్తే వికారాబాద్ రైల్వే పీఎస్‌లో సంప్రదించాలని ఆయన తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కార్మికుడి ఖాతా నుంచి
రూ.1,89,200 బదిలీ
సర్‌పై అపోహలు వద్దు
తహసీల్దార్ రాజేందర్‌రెడ్డి
యోగా సాధనతో
సంపూర్ణ ఆరోగ్యం