సమగ్ర ఓటరు జాబితాకు సహకరించండి | - | Sakshi
Sakshi News home page

సమగ్ర ఓటరు జాబితాకు సహకరించండి

Jun 18 2026 8:04 AM | Updated on Jun 18 2026 8:04 AM

సమగ్ర ఓటరు జాబితాకు సహకరించండి హుండీ ఆదాయం లెక్కింపు దౌల్తాబాద్‌ ఏఓగా తులసి 21న తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళనం

అడిషనల్‌ కలెక్టర్‌ వెంకటాచారి

కొడంగల్‌ రూరల్‌: సమగ్ర ఓటరు జాబితాకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అడిషనల్‌ కలెక్టర్‌ వెంకటాచారి సూచించారు. బుధవారం పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయం నుంచి అంబేడ్కర్‌ చౌరస్తా వరకు 2కే రన్‌ నిర్వహించారు. ర్యాలీలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, రెవెన్యూ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటరు జాబితా సవరణ ప్రక్రియ(సర్‌)లో భాగంగా సర్వే నిర్వహించే అధికారులకు ప్రజాప్రతినిధులు, అన్ని పార్టీల నాయకులు సహకరించాలన్నారు. బూత్‌ లెవల్‌ ఏజెంట్లు సర్వేలో పాల్గొంటూ తప్పులు లేకుండా జాబితా సిద్ధం చేసేందుకు కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో కొడంగల్‌, దుద్యాల మండలాల తహసీల్దార్లు రాంబాబు, కిషన్‌నాయక్‌, ఎంఈఓ రాంరెడ్డి, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తాండూరు రూరల్‌: మండలంలోని కొత్లాపూర్‌ రేణుక ఎల్లమ్మ ఆలయ హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. మే ఒకటి నుంచి 31వ తేదీ వరకు అమ్మవారి జాతర కొనసాగింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో పాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి కానుకలు సమర్పించారు. ఆలయ ఆవరణలో లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. రూ.6,92,047 సమకూరినట్లు ఆలయ ఈఓ శేఖర్‌గౌడ్‌, చైర్మన్‌ ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పాంబండ రామలింగేశ్వర స్వామి ఆలయ ఈఓ బాల నర్సింహ పర్యవేక్షించారు. కరన్‌కోట్‌ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ డైరక్టర్లు సుజాత, నర్సింలు, పుఠ్యానాయక్‌, రాజుగౌడ్‌, రాజు, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

దౌల్తాబాద్‌: మండల వ్యవసాయ అధికారిగా తులసి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన ఏఓ లావణ్య పూడూరు మండలానికి బదిలీకాగా.. జిల్లా వ్యవసాయ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న తులసి ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండలంలో రైతులకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.

సంఘం వ్యవస్థాపకులు పిడమర్తి రవి

అనంతగిరి: నగరంలోని ఇందిరా పార్క్‌లో ఈ నెల 21న తెలంగాణ ఉద్యమ కారుల సమ్మేళనం నిర్వహించనున్నట్లు ఆ సంఘం వ్యవస్థాపకులు డాక్టర్‌ పిడమర్తి రవి తెలిపారు. బుధవారం వికారాబాద్‌లోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలన్నారు. ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం చేయాలన్నారు. గుర్తింపు కార్డులు, పెన్షన్‌ ఇవ్వాలన్నారు కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు, నాయకులు శ్రీనివాస్‌, కావాలి వసంత్‌ కుమార్‌, ఆకుల శివకుమార్‌, ప్రకాష్‌ గౌడ్‌, దష్టప్ప, డప్పు వెంకట్‌, ఈదనోళ్ల రాజు, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement