ఉద్యమ కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా బాలు | - | Sakshi
Sakshi News home page

ఉద్యమ కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా బాలు

Jun 18 2026 8:04 AM | Updated on Jun 18 2026 8:04 AM

ఉద్యమ కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా బాలు

బొంరాస్‌పేట: తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా మండలంలోని కొత్తూరుకు చెందిన బాల్‌రాజ్‌ నియమితులయ్యారు. బుధవారం హైదరాబాద్‌లో అన్ని జిల్లాల ఇన్‌చార్జ్‌ల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఉద్యమ కళాకారులకు ఉద్యోగ భద్రతపై చర్చించారు. తనను జిల్లా అధ్యక్షుడిగా నియమించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఉద్యమ కళాకారులకు న్యాయం, ఉద్యోగ భద్రతకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

రాష్ట్ర కమిటీ కోశాధికారిగా సలావుద్దీన్‌

బంట్వారం: తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం రాష్ట్ర కమిటీ కోశాధికారిగా డాక్టర్‌ ఎండీ సలావుద్దీన్‌ (బంట్వారం – బొప్పునారం) నియమితులయ్యారు. బుధవారం నగరంలో సంఘం వ్యవస్థాపకులు వెంకటేశం, ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సలహాదారు దరువు అంజన్న చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తానని అన్నారు. తన నియామకానికి సహకరించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రతాప్‌,సైదులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement