● వేగవంతంగా పూర్తి చేయాలి
● కాంగ్రెస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ తిరుపతిరెడ్డి
కొడంగల్: పేదల తిరుపతిగా పేరుగాంచిన కొడంగల్‌లోని మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు బుధవారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ తిరుపతిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంతుకుమార్ భూమిపూజ చేశారు. ఆలయ పురోహితులు వారికి స్వాగతం పలికారు. రూ.110 కోట్లతో పనులు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పనులను వేగవంతం చేయాలని సూచించారు. వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా నిర్మాణ పనులు చేపడుతున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. పనుల్లో జాప్యం జరగకుండా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్‌నాయక్, నాయకులు నందారం రత్నం, నందారం రాజు, మిఠాయి రాజు, మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి, దాము తదితరులు పాల్గొన్నారు.


