పూడూరు: అనుమానాస్పద స్థితిలో శనివారం ఓ వ్యక్తి ఒంటిపై గాయాలతో మృతి చెందిన సంఘటనపై పలు అనుమానాలు లేవనెత్తాయి. సదరు వ్యక్తి మృతికి వివాహేతర సంబంధమే కారణమనితెలుస్తోంది. ఆదివారం బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు వ్యక్తి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ఆమె తన కుటుంబీకులతో కలిసి హత్య చేసిందని ఆరోపిస్తూ.. చన్గోముల్ పోలీస్‌స్టేషన్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌడాపూర్ మండలం గోగ్యానాయక్‌తండాకు చెందిన నేనావత్ మంగ్యానాయక్(43)కు, అదే మండలం అడవివెంకటాపూర్ గ్రామానికి చెందిన కాట్రావత్ విజయమ్మతో కొంత కాలంగా వివాహేతర బంధం కొనసాగుతోంది. సదరు మహిళ భర్త గంగ్యానాయక్, కుమారుడు రవితో కలిసి నగరంలోని కిస్మత్‌పూర్‌లో ఉంటూ కూలీ పనులు చేస్తోంది. శనివారం ఉదయం మృతుడు మంగ్యానాయక్, విజయమ్మలు మండల పరిధి మన్నెగూడలో కలుసుకున్నారు. అక్కడి నుంచి గొంగుపల్లి సీతమ్మ గుడి వద్దకు వెళ్లారు. అక్కడ ఏం జరిగిందో కానీ.. మంగ్యానాయక్ ఒంటిపై గాయాలతో అచేతనగా పడున్నాడు. విషయాన్ని విజయమ్మ.. కుమారుడికి ఫోన్‌లో సమాచారం ఇచ్చింది. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. పరిసరాలను పరిశీలంచి ఆ మహిళను, ఆమె కొడుకును అదుపులోకి తీసుకున్నారు. శవాన్ని పరిగి మార్చురికి తరలించారు.
కొట్టి చంపారు..
మంగ్యానాయక్‌ను కొట్టి చంపారని, తమకు న్యాయం చేయాలని మృతుడి భార్య అంజిలమ్మ, కుమారులు శ్రీనివాస్, కై లాష్, కూతురు భూమిక, కుటుంబీకులు, బంధువులు చన్గోముల్ ఠాణా ఎదుట బైఠాయించారు. నిందితులను బయటకు పంపాలని పోలీస్‌స్టేషన్‌లోకి వెళ్లేందుకు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఎస్‌ఐ భరత్‌రెడ్డి మృతుడి కుటుంబీకులను సముదాయించారు. తగిన విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోస్టుమార్టం అనంతరం శవాన్ని అప్పగించారు. మృతుడి కుమారుడు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు విజయమ్మతో పాటు ఆమె భర్త గంగ్యా, కుమారుడు రవిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
మలుపు తిరిగినఅనుమానాస్పద మృతి కేసు
అనుమానితులనుఅదుపులోకి తీసుకున్న పోలీసులు
న్యాయం చేయాలంటూ మృతుడి బంధువుల ఆందోళన


