తాండూరు: తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం బీఆర్‌ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. కేక్‌లు కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. అనంతరం పార్టీ శ్రేణులు, నాయకులు మణికొండలోని పైలెట్ నివాసానికి తరలివెళ్లారు. రోహిత్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో జిల్లాగ్రంథాలయ సంస్థ చైర్మన్ సందల్ రాజుగౌడ్, మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ దీప నర్సింహులు, కౌన్సిలర్లు నవీనసంతోష్‌గౌడ్, ఇర్షాద్, మాజీకౌన్సిలర్లు వరాల శ్రీనివాస్‌రెడ్డి, ఇర్ఫాన్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, నాయకులు పట్లోళ్ల నర్సింహులు, గద్దె శ్రీనివాసచారి,సంతోష్‌గౌడ్‌లు ఉన్నారు. కాగా.. తాండూరు ప్రభుత్వ జిల్లా, మాతాశిశు ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అన్నదాన నిర్వహించారు. పట్టణంలోని పైలెట్ నివాసంలో నాయకులు వేడుకలు జరుపుకొన్నారు.
యాలాలలో..
యాలాల: తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ మండలఅధ్యక్షుడు చందాపురం రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నగరంలోని నివాసంలో రోహిత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాకప్పిసన్మానించారు. భారీ కేక్‌కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. సొసైటీ మాజీ వైస్ చైర్మన్ వడ్డే రాములు, మాజీ సర్పంచ్‌లు రవికుమార్‌గౌడ్, అరవింద్, నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీనివాస్, గణేశ్, విక్రాంత్, శరణుభూపాల్, లాలు ముదిరాజ్ తదితరులు ఉన్నారు.
నవాబుపేటలో..
మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి జన్మదిన వేడుకలు.. బీఆర్‌ఎస్ మండల ముఖ్య సలహాదారు, మాదిరెడ్డిపల్లి ఎంపీటీసీ మాజీ సభ్యుడు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్‌కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. ఇందులో పార్టీ నాయకులు శాంతికుమార్, పురుషోత్తం, నరేందర్ రెడ్డి, మహేశ్ రెడ్డి, సుధాకర్, శ్రీకాంత్ గౌడ్, శేఖర్, బద్రి, మల్లేశ్, వినోద్, మాణిక్ రెడ్డి, తలారి శేఖర్, అనంతయ్య, అనిల్, నవీన్, బక్కని శేఖర్, కిషోర్, రాజు, బక్కని కుమార్ పాల్గొన్నారు.


