పోగొట్టుకున్న చోటే వెతుక్కున్నాం
● ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షం
● తాండూరులో 5.03 సెం.మీ వర్షపాతం
● మాడ్గులలో 4.43 సెం.మీ నమోదు
● ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: మృగశిరకు ముందే ఉమ్మడిజిల్లాను తొలకరి పలకరించింది. ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న జనం శనివారం సాయంత్రం ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అకస్మాత్తుగా ఈదురు గాలులతో కూడిన వర్షానికి వాతావరణం చల్లబడింది. వికారాబాద్ జిల్లా తాండూరులో అత్యధికంగా 5.03 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా, రంగారెడ్డి జిల్లా మాడ్గులలో 4.43 సెంటీమీటర్లు నమోదైంది. శేరిలింగంపల్లిలో 4.08 సెం.మీ, కందుకూరులో 3.80 సెం.మీ, యాచారం మండలం నల్లవెల్లిలో 3.75 సెం.మీ, కడ్తాల్ మండలం ముద్వీన్‌లో 3.68 సెం.మీ, కొంగర కలాన్‌లో 3.38 సెం.మీ, మామిడిపల్లిలో 3.13 సెం.మీ, మణికొండలో 2.72 సెం.మీ వర్షపాతం నమోదైంది. వికారాబాద్ చౌడాపూర్‌లో 3.68 సెం.మీ, మదన్‌పల్లెలో 2.80 సెం.మీ, యాలాలలో 2.65 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఈదురు గాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయి విద్యుత్ లైన్లపై పడ్డాయి. వైర్లు తెగిపోవడంతో సరఫరాకు అంతరాయం ఏర్ప డింది. విద్యుత్ అధికారులు వెంటనే అప్రమత్తమైన సరఫరాను పునరుద్ధరించారు. మరోవైపు వర్షం ధాన్యం రైతులను నిండా ముంచింది. రాశులపై టార్పాలిన్లు లేకపోవడంతో తడిసి ముద్దయ్యాయి.
మా నాన్న టమాటా, వరి పెట్టేవారు. నేను ఎలాంటి రసాయనాలు వాడకుండా అదే పంటను సాగు చేస్తున్నా. మంచి దిగుబడి సాధిస్తున్నా. ఎన్టీఆర్ మార్కెట్‌కు తరలిస్తున్నా. మొదట్లో ఐదుగురు రైతులతో చిత్తాపూర్‌లో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశాం. శాస్త్రవేత్తలతో పాటు 150 మంది రైతులు ఉన్నారు. ఏ తెగులుకు ఏ మందు కొట్టాలో తెలుసుకునే అవకాశం ఉంది.
– జి.సుధాకర్, మంచాల మండలం
రసాయన ఎరువుల వాడకంతో భూమిలోని మిత్ర పురుగులు చనిపోయి సరైన దిగుబడి రాక నష్టాల పాలయ్యాం. అప్పులు తీర్చేందుకు ఉన్న 20 ఎకరాల్లో 10 ఎకరాలు అమ్ముకున్నాం. తర్వాత ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టాం. అమ్మిన పొలాన్ని మళ్లీ కొనుగోలు చేశాం. మరికొంత భూమిని లీజుకు తీసుకుని ప్రస్తుతం 70 ఎకరాల్లో 30 రకాల పంటలు సాగు చేస్తున్నాం.
– లావణ్య, తెల్కపల్లి, నాగర్‌కర్నూల్ జిల్లా


