మినీట్యాంక్‌బండ్‌గా కొత్తచెరువు కుంట | - | Sakshi
Sakshi News home page

మినీట్యాంక్‌బండ్‌గా కొత్తచెరువు కుంట

Jun 7 2026 9:18 AM | Updated on Jun 7 2026 9:18 AM

మినీట్యాంక్‌బండ్‌గా కొత్తచెరువు కుంట

పరిగి: పట్టణంలోని కొత్త చెరువు కుంటను పర్యాటక కేంద్రంగా మారుస్తానని ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన పట్టణ కేంద్రంలోని కొత్తచెరువు కుంట మరమ్మతు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్త చెరువు కుంటను పరిగి పట్టణంలో మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దుతానని అన్నారు. గతంలో కొత్త చెరువు కుంట అన్యాక్రాంతమయిందని.. ప్రస్తుతం చెరువు అభివృద్ధి పనులకు నిధులను కేటాయించామన్నారు ఎలాంటి సమస్యలున్నా తన తృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ మల్లేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement