అనంతగిరి: విత్తనాలు, ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తున్న ఫర్టిలైజర్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మైపాల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం వికారాబాద్‌లో రైతు సంఘం జిల్లా నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంది, పత్తి తదితర విత్తనాలు అధిక ధరలకు అమ్ముతున్నారన్నారు. డీఏపీ , యూరియా ఎమ్మార్పీ ధరకంటే అధికంగా అమ్ముతున్నారని ఈ విషయంలో అధికారులు సంబంధిత దుకాణాలపై దాడులు చేసి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పలు దుకాణాల్లో బిల్లులు ఇవ్వడం లేదని ఆరోపించారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఫర్టిలైజర్ దుకాణాలపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణ, నర్సింలు, అనంతయ్య, బాలరాజు, తేజ, ఆదిత్య, వెంకట్, యాదయ్య, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మైపాల్


