ఇద్దరిపై అట్రాసిటి కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

ఇద్దరిపై అట్రాసిటి కేసు నమోదు

Jun 7 2026 9:18 AM | Updated on Jun 7 2026 9:18 AM

ఇద్దరిపై అట్రాసిటి కేసు నమోదు వివాహిత అదృశ్యం పూర్వ విద్యార్థుల సమ్మేళనం

పూడూరు: వ్యక్తిపై దాడి చేసిన సంఘటనలో ఇద్దరిపై అట్రాసిటీ కేసు నమోదైన సంఘటన చన్గోముల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ భరత్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పూడూరు మండల కేంద్రానికి చెందిన పట్లోళ్ల శ్రీకాంత్‌రెడ్డి వాటర్‌ ట్యాంకర్‌తో గ్రామం నుంచి వెళ్తుండగా.. ఆదే గ్రామానికి చెందిన తిర్మలాపూర్‌ రమేష్‌ ట్యాంకర్‌ను ఆపి ఎక్కడికి పోతుందని ప్రశ్నించారు. దీంతో ఇద్దరి మధ్య మాటమాట పెరిగి, గొడవకు దారితీసింది. ఈ క్రమంలో శ్రీకాంత్‌రెడ్డి, అతని కుమారుడు మౌనిక్‌రెడ్డిలు తిడుతూ రమేష్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో సదరు వ్యక్తి గాయపడ్డాడు. గత నెల 21న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. ఇందులో భాగంగా శనివారం మెడికల్‌ రిపోర్టులతో పాటు.. తదితర సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకొని శ్రీకాంత్‌రెడ్డి, మౌనిక్‌రెడ్డిలపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

యాలాల: కిరాణ కొట్టుకు వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన సంఘటన మండల పరిధిలోని కోకట్‌లో చోటుచేసుకుంది. ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సంతోష్‌, అంజలి భార్యాభర్తలు. శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో అంజలి కిరాణ కొట్టు వరకు వెళ్లి వస్తానని చెప్పి, బయటికి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. చుట్టుపక్కల, స్నేహితులు, బంధువుల వద్ద గాలించినా ఫలితం లేకుండా పోయింది. సంతోష్‌ ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

కుల్కచర్ల: పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది. మండల పరిధి ముజాహిద్‌పూర్‌ జడ్పీ పాఠశాలలో 1998– 99లో పదో తరగతి చదువుకున్న బాల్యమిత్రులు.. శనివారం ఒకే వేదికగాసందడి చేశారు. ఆటపాటలతో కేరింతలు కొట్టారు. నాటి జ్ఞాపకాలు గుర్తుకు చేసుకుంటూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. విద్యాబుద్ధులు చెప్పిన ఉపాధ్యాయులను సన్మానించారు. రాంరెడ్డిపల్లి సర్పంచ్‌గా ఎన్నికై న పూర్వ విద్యార్థి నర్సింహులు యాదవ్‌ను సహచర విద్యార్థులు సన్మానించారు. ఎంఈఓ అబీబ్‌ అహ్మద్‌, పీఆర్టీయూ శంషాబా, మండల అధ్యక్షుడు భాస్కర్‌, ఆర్టీసీ ఉద్యోగి చంద్రయ్య, అంబు, వెంకట్‌, పులింగ వెంకటేశ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement