‘ప్రీ ప్రైమరీ’ని అంగన్‌వాడీలకు అప్పగించాలి | - | Sakshi
Sakshi News home page

‘ప్రీ ప్రైమరీ’ని అంగన్‌వాడీలకు అప్పగించాలి

Jun 7 2026 9:18 AM | Updated on Jun 7 2026 9:18 AM

యాలాల: ప్రీ ప్రైమరీ విద్యను అంగన్‌వాడీ టీచర్లకు అప్పగించి, ఐసీడీఎస్‌ను బలోపేతం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప డిమాండ్‌ చేశారు. శనివారం అంగన్‌వాడీ కార్యకర్తలతో కలిసి తహసీల్దార్‌ గాయత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఐసీడీఎస్‌ను నిర్వీర్యం చేసే కుట్రలను భగ్నం చేస్తామన్నారు. 2020లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఎన్‌ఈపీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అంగన్‌వాడీ ఉద్యోగులు పోరాటాలు చేస్తున్నారన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సైతం దొడ్డిదారిన ఎన్‌ఈపీ చట్టాన్ని అమలు చేయడం సరికాదన్నారు. అంగన్‌వాడీ వ్యవస్థను బలపర్చాల్సిన ప్రభుత్వాలు, నిర్వీర్యం దిశగా వెళ్తుండడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో కవిత, భాగ్యలక్ష్మి, అనంతమ్మ, లక్ష్మీదేవి, భారతమ్మ, శాంతిబాయి తదితరులు ఉన్నారు.

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప

Advertisement
 
Advertisement
Advertisement