నాటు సారా తయారీ కేంద్రాలపై దాడి | - | Sakshi
Sakshi News home page

నాటు సారా తయారీ కేంద్రాలపై దాడి

Jun 6 2026 9:13 AM | Updated on Jun 6 2026 9:13 AM

బషీరాబాద్‌: నాటు సారా తయారీ కేంద్రాలపై ఆబ్కారీ పోలీసులు వరుస దాడులు చేస్తున్నారు. ఆబ్కారీ జిల్లా అధికారి విజయభాస్కర్‌ ఆదేశాలతో శుక్రవారం అసిస్టెంట్‌ ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ రెడ్డి బృందం.. కొత్లాపూర్‌, వాల్యనాయక్‌ తండా, బాబునాయక్‌తండాలో దాడి చేసింది. ఈ సంఘటనలో హన్మానాయక్‌, తులసిబాయి, రెడ్యానాయక్‌ దగ్గర 9 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. 300 లీటర్ల బెల్లం పానకం పారబోశారు. 9మందిని తహసీల్దార్‌ ఎదుట హాజరుపరిచి బైండోవర్‌ చేశారు.మూడు కేసులు నమోదు చేశామని తాండూరు ఎకై ్సజ్‌ సీఐ రాణి తెలిపారు. నాటుసారా తయారీ, విక్రయం, రవాణా చటరీత్యా నేరమని హెచ్చరించారు. ఎక్కడైనా సారా తయారు చేసినట్లు తెలిస్తే.. 8712658754 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

9 మంది బైండోవర్‌, 3 కేసులు నమోదు

300 లీటర్ల బెల్లం పాకం పారబోత

Advertisement
 
Advertisement
Advertisement